Sunday, January 8, 2012

Wanted Father


Image Courtesy: http://t3.gstatic.com

.

Father!

Let me pride thinking of you for once, before you die.

When I strain to figure you out

Your hands dragging my mother

Catching her by hair come to mind.

And the stamp of your foot on my neck

Still stands like a tattoo.

My childy little hands

That pleaded you unknowingly

Still grip those childhood nightmares.

.

Father!

I just long to like you before I die.

When you flash in my memory

Even the dozy eyelids at midnight

Open with fright shedding deep slumber

Recalling your inebriated babble and bluster.

Your troubled life seeking after justice

Shivers me in my shoes.

My cheeks benumbed by your slaps

Have made my heart insensitive to tears.

.

I yearn to wail heartily for you.

.

You thought your words work like whip for ever…

Thought that the leather you suppressed the siblings with

Would never give in…

Now, the same hands and legs badly seek a support, and

Your soul craves for the touch of love and affection.

All of a sudden you expect

Your children to discharge their filial piety,

And the wife to forget all her heart-aches

And condescend to serve.

.

Father!

I want to love you instinctively before I die.

True!

You pampered my brother

Buying him and changing his kids wear.

And once in a while, say, for BHOGI*

You bathed us three children with flair.

True!

By icing your love with five-star chocolates

You converted my younger sis to your way.

But

Never were you aware

That a father should give life to his children,

That a father is a splendid ornament to their mother,

That a father is a paradigm of reassurance.

.

Father!

I want to talk proud of you before you die.

.

Father!

I want to reclaim you before I die.

- Translated by N.S.Murthy


*BHOGI: Is a festival celebrated (mostly) in South India on the eve of Sun resuming his northward journey touching Tropic of Capricorn, by entering constellation Capricorn (celebrated variously as Pongal / Makara Sankranti etc.,


(Original Poem by K.గీత)

నాన్న కావాలి …

.

నాన్నా! ఒక్కసారి నిన్ను తల్చుకుని గర్వపడనివ్వు

మరణించేలోగా…

నిన్ను గుర్తు తెచ్చుకోబోతే

అమ్మజుట్టుని బలంగాఈడ్చుకెళ్ళిన నీ చేతులు కన్పిస్తాయి.

నా పీకమీద నీ పాద ముద్ర పచ్చబొట్టులా చెరగకుంది.

తెలియకుండానే అర్థించిన పసి అరచేతుల జతలు

బాల్యపు దుఃఖాన్ని అదిమిపెట్టాయి.

నాన్నా! నాకొక్కసారి నిన్ను ఇష్టపడాలని ఉంది మరణించేలోగా.

నువ్వు జ్ఞప్తికిరాబోతే

అర్థరాత్రి నిద్రకళ్ళకి నీ తాగుబోతుప్రేలాపనావాదాలు

స్వప్నంలోనూ జడిపిస్తాయి.

రచ్చకెక్కి మరీ రభసచేసుకున్ననీ బ్రతుకు

నన్ను నిలువునా వణికిస్తుంది.

చెంపదెబ్బలకి మొద్దుబారిపోయిన చెక్కిళ్ళు

అశ్రుధారల్ని గుండెకుసైతం స్పర్శ తెలీకుండా చేసాయి.

నీకై మనసారా వ్యధపడాలనుంది.

ఏటెల్లకాలమూ నీమాటలు కొరడాలనుకున్నావు.

ఎప్పుడూ నలుసుల్ని తొక్కిపెట్టిన చెప్పు తెగదనుకున్నావు.

ఇప్పుడు నీ కాళ్ళకీ చేతులకీ ఆసరా కావాల్సొచ్చింది.

మనసుకి ఇప్పుడు మమతానురాగాలు ఆవశ్యకమయ్యాయి.

పిల్లలంతా ఇప్పటికిప్పుడు పితృప్రేమాంకితులయిపోవాలి.

భార్య గుండెమంటలార్పుకుని, పడీ లేచీ, సేవలందించాలి.

నాన్నా! సహజంగా ప్రేమించాలనుంది నిన్ను మరణించేలోగా.

అన్నయ్య చెడ్డీలు మార్చి మురిపెంగా చూసేవు, నిజమే.

ఏడాదికొక్కసారి భోగి స్నానం

ముగ్గురికీ మనఃస్ఫూర్తిగానే చేయించావు

ఫైవ్ స్టార్ చాక్లెట్టు ప్రేమపూతతో చెల్లిని

బాగానే నీ పార్టీలో చేర్చుకున్నావు.

నాన్నంటే—

పిల్లలకి జీవితాన్నివ్వాలనీ

నాన్నంటే

అమ్మకి సరికొత్త ఆభరణమనీ

నాన్నంటే

ఒక భద్రతా నిర్వచనమనీ

నీ కసలు తెలీనేలేదే!?!

నాన్నా ! నువ్వు మరణించేలోగా

నిన్ను చూసి నేను గొప్పగా గర్వించాలనుంది.

నాన్నా! నేను మరణించేలోగా

నిన్ను దక్కించుకోవాలనుంది.

.

20.7.1992

కె. గీత

“ద్రవభాష” కవితా సంకలనం నుండి.